అప్పటివరకు PhonePe, Google Pay, Paytm వంటి యూపీఐ (UPI) అప్లికేషన్‌ల ద్వారా కరెంట్ బిల్లు చెల్లింపు సులభంగా చేయవచ్చు. అయితే, ఈ ప్లాట్‌ఫామ్‌లు అధిక చార్జీలు, అదనపు చలానాలు వసూలు చేస్తున్నాయని గమనించిన ప్రభుత్వము, వాటిలో కరెంట్ బిల్లు చెల్లింపు సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది.
దీని వల్ల ప్రజలు MeeSeva కేంద్రాలు, గ్రామ/వార్డు సచివాలయాలు లేదా విద్యుత్ కార్యాలయాలకు స్వయంగా వెళ్లి బిల్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్నంగా WhatsApp ద్వారా కరెంట్ బిల్లు చెల్లింపు సేవను ప్రవేశపెట్టింది. ఈ సర్వీస్ ద్వారా, ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేస్తూ, ప్రజలకు వేగవంతమైన, వినూత్నమైన పరిష్కారాన్ని అందించింది.
WhatsApp ద్వారా కరెంట్ బిల్లు ఎలా చెల్లించాలి?
WhatsApp ద్వారా కరెంట్ బిల్ చెల్లింపు – Step by Step Guide
Step 1:
మీ ఫోన్‌లో (+91 95523 00009) ఈ గవర్నమెంట్ అధికారిక వాట్సాప్ నెంబర్‌ను సేవ్ చేసుకోండి.
Step 2:
వాట్సాప్‌లో సేవ్ చేసిన నెంబర్‌ను ఓపెన్ చేసి "హాయ్" అని మెసేజ్ పంపండి.
Step 3:
మీ మెసేజ్‌కు రిప్లైగా "మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్" అనే మెసేజ్ వస్తుంది.
అందులో "మీ సేవను ఎంచుకోండి" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
Step 4:
వాట్సాప్ ద్వారా ప్రభుత్వం అందించే వివిధ సర్వీసుల లిస్ట్ కనిపిస్తుంది.
అందులో "ఎనర్జీ సేవలు" అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.
Step 5:
మీ కరెంట్ బిల్లు నెంబర్ (సర్వీస్ నెంబర్) ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి.
బిల్లు వివరాలు వస్తాయి.
అందులో "బిల్లు చెల్లించండి" అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.
Step 6:
మీ బిల్లు వివరాలు (వినియోగదారుని పేరు, సర్వీస్ నెంబర్, బిల్లు మొత్తం, చివరి తేదీ) అందుబాటులో ఉంటాయి.
బిల్లు కింద "UPI చెల్లింపు" అనే ఆప్షన్ వస్తుంది.
PhonePe, Google Pay, Paytm, WhatsApp Pay వంటి UPI యాప్ ద్వారా బిల్లు చెల్లించండి.
బిల్లు సక్సెస్‌ఫుల్‌గా చెల్లించిన వెంటనే వాట్సాప్‌లోనే రిసీప్ట్ వస్తుంది. దీన్ని సేవ్ చేసుకోండి.
---
Latest Government Jobs & Government Schemes
గవర్నమెంట్ జాబ్స్, స్కీమ్స్, అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్‌కి జాయిన్ అవ్వండి.
WhatsApp Group Link: Click Here








