హలో ఫ్రెండ్స్ పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలి. అదేంటంటే మీ పాన్ కార్డు కి మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి లింక్ ఉందా లేదా అనేది ఎప్పుడైనా చూసుకున్నారా? 90 శాతం మంది పాన్ కార్డులకి మొబైల్ నెంబర్ వాళ్లది ఉన్నప్పటికీ ఈమెయిల్ ఐడి మాత్రం ఖచ్చితంగా వేరే వాళ్లది ఉంటుంది. ఎందుకంటే మీరు పాన్ కార్డు ఎక్కడైతే అప్లై చేస్తారో ఇంటర్నెట్లో కానీ మీ సేవలో కానీ వాళ్లు వాళ్లకు సంబంధించిన మెయిల్ ఐడి మీ పాన్ కార్డుకి లింక్ చేస్తారు. దీనివలన మనం పాన్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోలేం. ఎందుకంటే ఫోన్ నెంబర్ లింక్ ఉన్నప్పటికీ ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే లింక్ అయినా మెయిల్ కు వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు పాన్ కార్డుకి మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి ఏ విధంగా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం.ఈ ప్రాసెస్ చేయడం కోసం మన ఆధార్ కి మొబైల్ లింక్ అయి ఉండాలి. ఆధార్ ఓటిపి ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది
1. పైన కనిపిస్తున్న లింకు పైన క్లిక్ చేయండి. మీకు ఈ విధమైన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
2. పైన కనిపిస్తున్న విధంగా మీ పాన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, మీ డేట్ అఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన క్లిక్ చేయండి ఇవ్వండి. Captha Validation ఇచ్చిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి
3. తర్వాత పైన కనిపిస్తున్న విధంగా E Kyc పైన క్లిక్ చేయండి.
4. తర్వాత మీ ఆధార్ కార్డు రిజిస్టర్ అయిన మొబైల్ కి ఓటిపి వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి Submit బటన్ పైన క్లిక్ చేయండి.
5. ప్రస్తుతం మీ పాన్ కార్డు కి ఏదైతే మొబైల్ మరియు ఈమెయిల్ లింక్ అయి ఉన్నాయో అవి ఇక్కడ కనిపిస్తాయి. అవి మీవి కావు అనుకున్నట్లయితే కింద ఎస్ బటన్ పైన క్లిక్ చేసి, దాని కిందనే ఉన్న బాక్సులలో మొబైల్ నెంబర్ ని అలాగే మెయిల్ ఐడి ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
అంతే రెండు వారాలలో మీ పాన్ కార్డుకి ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి రెండు కూడా లింక్ అయిపోతాయి.
ఈ ప్రాసెస్ కు సంబంధించిన పూర్తి వీడియో ఇక్కడ ఉంది క్లిక్ చేసి చూసేయండి.