హలో ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే. చాలామంది దీన్ని కెరియర్ గా మలుచుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే యూట్యూబ్ లో కొత్తగా యాడ్సెన్స్ అప్రూవల్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్లకి ఈ వీడియో చాలా యూస్ అయితే అవుతుంది .
ఎవరైతే యూట్యూబ్లో 100 డాలర్లు సంపాదిస్తారో వాళ్ల డబ్బులు ఆటోమేటిక్గా వాళ్లు సెట్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి ఆ బ్యాంక్ అకౌంట్ సెట్ చేయడం కోసం ఆప్షన్ చూపించకపోతే ఏం చేయాలి. ఈ సమస్య చాలా మందికి వస్తుంది, అంతేకాదు సంపాదించిన అమౌంట్ కూడా యాడ్సెన్స్ లో కనిపించడం లేదు. ఈ సమస్యకి ఒక చిన్న సెట్టింగ్ ని మార్చితే సరిపోతుంది.
అది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకోండి.
మీరు యాడ్సెన్స్ లోకి లాగిన్ అవ్వండి,
పేమెంట్స్ అనే ఆప్షన్ లోకి వెళ్లి అందులో పేమెంట్ ఇన్ఫో అనే ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేయండి.
ఎక్కడ మీకు మీరు సంపాదించిన అమౌంట్ జీరో గా చూపిస్తుంది. అలాగే యాడ్ పేమెంట్ మెథడ్ (Add Payment Method) అనే ఆప్షన్ కనిపించదు.
ఇప్పుడు మీరు పైన ఫోటోలో చూపించిన విధంగా పేమెంట్స్ అకౌంట్ Payments Account అనే ఆప్షన్ దగ్గర యూట్యూబ్ ఇండియా Youtube India అనే ఆప్షన్ ని సెట్ చేసుకోండి.
అంతే ఇప్పుడు మీరు యూట్యూబ్లో సంపాదించిన అమౌంట్ చూపిస్తుంది, అలాగే ఆడ్ పేమెంట్ మెథడ్ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది.
ఇప్పుడు మీరు యాడ్ పేమెంట్ మెథడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ అకౌంట్ ని యాడ్ చేసుకోవచ్చు.
ఈ ప్రాసెస్ మొత్తం మీకు వీడియో రూపంలో కావాలనుకుంటే కింద కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేసి ఫాలో అవ్వండి.
మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. Click Here Whatsapp